మాలినేని కళాశాలలో ‘సంస్కృతి-2026’ సంబరాలు: ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఏలూరి

0
0

మాలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ‘సంస్కృతి 2026’ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు కళాశాల ఎన్.సి.సి విద్యార్థినులు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’తో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను, క్రమశిక్షణను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారతకు సాంకేతిక విద్యే మూలమని ఆయన పేర్కొన్నారు.
కళాశాల ప్రాంగణం విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మాలినేని లక్ష్మయ్య, ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.