Home South Zone Andhra Pradesh పేద ప్రజల ఇళ్లకు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం అన్యాయం

పేద ప్రజల ఇళ్లకు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం అన్యాయం

0

విజయవాడ: అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వెనుక ఉన్న G+3 పునరావాస అపార్ట్‌మెంట్లలో పేద ప్రజల ఇళ్లకు అదానీ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని నిరసిస్తూ శనివారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. సిపిఎం నేతలు బి. రమణారావు, కె. దుర్గారావు, చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు దొంగచాటుగా పేదల ఇళ్లకు వీటిని బిగించడం అన్యాయమని మండిపడ్డారు.

మీటర్ రీడింగ్ సరిగ్గా రావడం లేదని నమ్మించి, మోసపూరితంగా కొత్త మీటర్లు పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే ఈ స్మార్ట్ మీటర్లను తొలగించి పాత మీటర్లనే పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

NO COMMENTS

Exit mobile version