Home South Zone Andhra Pradesh భక్తి పారవశ్యం: బెజవాడ దుర్గమ్మకు బంగారు మంగళసూత్రాలు విరాళం.

భక్తి పారవశ్యం: బెజవాడ దుర్గమ్మకు బంగారు మంగళసూత్రాలు విరాళం.

0

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి బంగారు సూత్రాలు విరాళం

ఇంద్రకీలాద్రిపై వెలసిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ మరియు శ్రీ మల్లేశ్వర స్వామి వారలకు భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. చింతలపూడి, మండవల్లి మండలం ఏలూరు జిల్లా చెందిన మేడపాటి వెంకట నాగిరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారి అలంకరణ నిమిత్తం మరియు ఆలయ అభివృద్ధి నిమిత్తం భారీ విరాళాన్ని అందజేశారు.

దాతలు ఈరోజు ఆలయ అధికారులను కలిసి 32.500 గ్రాములు రూ.5,32,500/- (ఐదు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే) విలువైన విరాళాన్ని సమర్పించారు.

ఆలయ అధికారులు దాతలకు స్వామి వారి శేషవస్త్రం మరియు ప్రసాదాలను అందజేసి, ప్రత్యేక ఆశీర్వచనం గావించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాదికారి వారి సమక్షములో చైర్మన్ గారు మరియు పాలక మండలి సభ్యులు చేతులు మీదుగా విరాళం అందజేసినారు.

NO COMMENTS

Exit mobile version