పుంగనూరు: అగ్నిప్రమాదంలో రూ 25 వేలు నష్టం

0
0

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, హనుమంతరాయునిదిన్నెలో శుక్రవారం మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక రైతు రాజేష్ కు చెందిన తోటలో మంటలు చెలరేగాయి.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ. 25 వేల నష్టం వాటిల్లినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు# కొత్తూరు మురళి.