ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న **’ప్రజా దర్బార్’**ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పిలుపునిచ్చారు.
పటమట అశోక్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె స్వయంగా వినతులు స్వీకరించారు. గత ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందని విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతి సమస్యను ఆన్లైన్లో నమోదు చేసి, అధికారుల ద్వారా త్వరితగతిన పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని ఆమె స్పష్టం చేశారు.










