మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ వేణుగోపాల్ నగర్లోని శ్రీ దర్పన్ స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి.
పాఠశాల డైరెక్టర్ అంతం శ్రీధర్ రెడ్డి, ప్రిన్సిపల్ అంతం సునీతా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో చిన్నారులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, ఆటపాటలు, ఇతర సృజనాత్మక యాక్టివిటీస్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి చదువుతో పాటు కళలు కూడా దోహదపడతాయని తెలిపారు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులు తమ ఉద్యోగ వ్యాపారాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, పిల్లల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని ఆమె సూచించారు. అప్పుడే పిల్లల్లో మానసిక వికాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.
వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య రూపకాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. రంగురంగుల దుస్తుల్లో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
#sidhumaroju
Alwal
Home South Zone Telangana శ్రీ దర్పన్ స్కూల్ దశాబ్ది వేడుకలు: ముఖ్య అతిథిగా శాంతి శ్రీనివాస్ రెడ్డి.|










