మదనపల్లె పార్టీ కార్యాలయంలో కాన్షీరామ్ జయంతి వేడుకలు.

0
0

మదనపల్లె పార్టీ కార్యాలయంలో ఆదివారం బహుజన రాజ్యాధికార స్థాపకుడు కాన్షీరామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు.

దేశంలోని 82 శాతం ఉన్న బహుజనుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం కాన్షీరామ్ తన జీవితాన్ని త్యాగం చేశారని, “ఎవరి సంఖ్య ప్రకారం వారికి అంతా” అనే నినాదంతో ఆత్మగౌరవ పోరాటాన్ని నడిపిన మహనీయుడని నాయకులు కొనియాడారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.