అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో ఆదివారం, సోమవారం (15, 16 తేదీలలో) అంగరంగ వైభవంగా గంగజాతర జరిగింది. ఈ జాతరను సోమల మండలంలోనే అతి పెద్ద గంగజాతరగా పరిగణిస్తారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.
కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు. ప్రతియేటా బలులు, దీప నైవేద్యాలతో అమ్మవారిని మొక్కుకుంటారు
# కొత్తూరు మురళి.










