ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు మంగళగిరిలో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించనున్నారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న 11.16 లక్షల మంది దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వారితో పాటు ఉండే సహాయకులకు కూడా టిక్కెట్‌లో 50 శాతం రాయితీ లభించనుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ. 207 కోట్ల భారం పడనుంది. గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ఉగాది పర్వదినం ముందు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
