Home South Zone Andhra Pradesh అమరజీవి ఆశయ సాధనలో పయనించాలి: డీఆర్వో.

అమరజీవి ఆశయ సాధనలో పయనించాలి: డీఆర్వో.

0

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు గొప్ప త్యాగమూర్తి అని అన్నమయ్య జిల్లా డీఆర్వో మధుసూదన రావు కొనియాడారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సోమవారం మదనపల్లి పట్టణంలోని ఆయన విగ్రహానికి డీఆర్వో, బీజేపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదని, ప్రతి ఒక్కరూ ఆ మహనీయుడి త్యాగాన్ని స్మరించుకోవడమే కాకుండా, ఆయన ఆశయ సాధన కోసం నడుచుకోవాలని ఆయన సూచించారు.

NO COMMENTS

Exit mobile version