భరోసానిచ్చిన పసుపు జెండా: ప్రమాద బీమాతో ఆదుకున్న తెలుగుదేశం పార్టీ.

0
1

బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం మండలం, పెదపులుగువారిపాలెం గ్రామానికి చెందిన అక్కల కృష్ణారెడ్డి గతంలో రూ.100లతో పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్నారు.
ఇటీవల ఆయన ప్రమాదవశాత్తు మరణించడంతో, ఆయన కుటుంబానికి పార్టీ తరపున రూ. 5 లక్షల ప్రమాద బీమా మంజూరైంది. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆదేశానుసారం కర్లపాలెం మండల పార్టీ జనరల్ సెక్రటరీ బాజీ, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ నక్కల వెంకటస్వామి నేడు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల బీమా పత్రాన్ని అందజేశారు. కష్టకాలంలో పార్టీ అండగా నిలవడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.