అన్నమయ్య జిల్లా మదనపల్లె కోళ్లబైళ్ళు2 పరిధిలో ఓ యువకుడిపై దాడి జరిగిన ఘటన సోమవారం కలకలం రేపింది. సోమశేఖర్ కుమారుడు భార్గవ్ (20) పై ఈశ్వర్ రెడ్డి కుమారుడు కార్తీక్ (క్రాంతి) దాడి చేసినట్లు సమాచారం.
ఈ ఘటనలో భార్గవ్ ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.










