కలెక్టరేట్ ఆవరణలో మౌలిక సదుపాయాలపై కలెక్టర్ వినోద్ కుమార్ సమీక్ష.

0
0

బాపట్ల జిల్లా: ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్ల భవన సముదాయాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.         కలెక్టరేట్ కు వచ్చే ప్రజల కొరకు సామాజిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సామాజిక మరుగుదొడ్లు   నిర్మిస్తున్నామన్నారు.

స్వచ్ఛభారత్ కార్పొరేషన్ నుంచి రూ.21లక్షలు, డి ఎం ఎఫ్ నిధి నుంచి రూ.9 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. రూ.30 లక్షల నిధులతో నిర్మిస్తున్న 20 మరుగుదొడ్లు, 20 యూరినల్స్, సింక్ లు, కొళాయి కనెక్షన్లు, నీటి వసతి సౌకర్యాలను ఆయన పరిశీలించారు. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, యూరినల్స్ ఏర్పాటు చేయడాన్ని పరిశీలించిన ఆయన  ప్రహరీ గోడ నిర్మించాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలతో పనులు ఉండాలని సూచించారు. భవన సముదాయంలో ఎగ్జిస్టెడ్ ఫ్యాన్లు, వంటి తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. భవన సముదాయానికి బోర్డు, ప్రహరీ గోడ వెలుపల వైపు చిత్రాలు వేయించాలని, వారంలో పనులు పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ అనంతరాజు, డీఈ, ఎఇ, గుత్తేదారుడు, తదితరులు ఉన్నారు.

#Narendra