చంద్రబాబు మార్క్ పాలన: ఇఫ్తార్ హామీపై గంటల్లోనే జీవో విడుదల.

0
0

విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఇమామ్‌లు మరియు మౌజన్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 45 కోట్ల గౌరవ వేతన బకాయిలను వెంటనే విడుదల చేస్తానని ఇఫ్తార్ వేదికపై ఆయన హామీ ఇచ్చారు.

చెప్పిన గంటల వ్యవధిలోనే ప్రభుత్వం స్పందించి నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,000 మంది ఇమామ్‌లు, మౌజన్‌లకు లబ్ధి చేకూరనుంది. ఇచ్చిన మాటను ఇంత వేగంగా నిలబెట్టుకోవడంతో ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.