మదనపల్లె–బెంగళూరు జాతీయ రహదారిలో మడికయ్యల శివాలయం వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని బుధవారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించనున్నారు.
డీఐజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రిలు భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇకపై మదనపల్లె కేంద్రంగా పోలీసు కార్యకలాపాలు పూర్తిస్థాయిలో సాగనున్నాయి. దీని ద్వారా జిల్లా ప్రజలకు పోలీసు సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందనున్నాయి.
