Home South Zone Telangana Moinabad farm house drugs

Moinabad farm house drugs

0

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసును ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో లోతైన విచారణ కోసం చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ బృందంలో గ్రేహౌండ్స్ కమాండర్ రవీందర్, షాద్‌నగర్ డీసీపీ శిరీషతో పాటు ఈగల్ ఫోర్స్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి? దీని వెనుక ఉన్న నెట్‌వర్క్ ఏమిటి? అనే కోణంలో SIT విచారణ జరపనుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version