దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్లు ఇలా తీసుకోండి!

0
0

AP: నేటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుంది. అమరావతిలో CM చంద్రబాబు నాయుడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించనున్నారు.
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని బస్పాస్ కౌంటర్లలో సర్టిఫికెట్లు చూపించి పాస్‌లు తీసుకోవచ్చు. APSRTC యాప్, మనమిత్ర యాప్ ద్వారా డిజిటల్ పాస్ కూడా పొందవచ్చు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 11.16 లక్షల మంది దివ్యాంగులు లబ్ధి పొందుతారు.