అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఉన్న పాత బోర్డు పూర్తిగా జీర్ణావస్థకు చేరింది. తుప్పు పట్టి ప్రమాదకరంగా మారినా, అధికారులు పట్టించుకోకపోవడం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఈ బోర్డును ఎప్పుడు తొలగించి కొత్తదాన్ని ఏర్పాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.










