అల్వాల్ పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం.|

0
14

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సమాజ రక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసుల సేవలను గుర్తించడం అభినందనీయమని పలువురు కొనియాడారు.
శనివారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ సీతారామ నామ సంకీర్తన సంఘం ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ఘన సన్మానం నిర్వహించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిదని, ప్రజల భద్రత కోసం వారు చేస్తున్న కృషిని అభినందిస్తూ సంఘం సభ్యులు పోలీసులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. పండుగలు, ఇతర కార్యక్రమాల సమయంలో తమ కుటుంబాలకు దూరంగా ఉండి విధులు నిర్వహించే పోలీసులకు గౌరవం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ నామ సంకీర్తన సంఘం సభ్యులు, అల్వాల్ పోలీస్ స్టేషన్ అధికారులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal