బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు,రేపు వానలు పడతాయని APSDMA తెలిపింది.ఇవాళ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.రేపు విజయనగరం,VZG, అనకాపల్లి,కృష్ణా,NTR,గుంటూరు,బాపట్ల,ATP, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
#BOIENA RAJESH










