ముస్లిం… మైనారిటీల అభివద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య

0
19

కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉందని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు.రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక నవాబుపేట ఈద్గా ప్రార్థన మందిరం వద్ద జరిగిన ముస్లిం మైనారిటీల మత పరమైన ప్రార్ధనలకు ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వ బరకాతుహ్ అంటూ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనం అందరూ ఒకే దేవుని సృష్టులం, భగవంతుని మార్గంలో ఐక్యంగా నడవాలని రంజాన్ పవిత్ర మాసం మనకు సూచిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఈ సోదరత్వాన్ని పెంచుతోందని,మతం,కులం, మతపరమైన విభేదాలను మరచి, పేదలు, రైతులు, యువత, మహిళల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఈ మహత్తరమైన రంజాన్ పండుగ సందర్భంగా మీతో కలిసి ఆ అల్లాహ్‌ను ప్రార్ధించే అవకాశం ఇచ్చినందుకు అల్లాహ్‌కు, నా ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. కార్యక్రమంలో చీరాల నియోజవర్గ అధికార ప్రతినిధి మహీంద్రానాథ్ పాల్గొన్నారు.