రాయచోటి మండలం అబ్బవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి వారి తనయుడు మండిపల్లి నిచ్చల నాగిరెడ్డి గారు పాల్గొన్నారు వీరికి ఆలయ కమిటీ సభ్యులు దేవస్థానం అధికారులు టిడిపి నేతలతో పాటు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి వారిచే ప్రత్యేక పూజలు గావించి వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం శాలువాతో సత్కరించి గజమాలతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి వారిని భక్తితో పూజించి వారికి సత్యం సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢ నమ్మకం అన్నారు అనంతరం కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు
Home South Zone Andhra Pradesh శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి










