Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్‌.. పేద ముస్లిం కుటుంబానికి కొత్త ఇల్లు.

0
2

మంగళగిరిలో ఓ పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన మాటను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిలబెట్టుకున్నారు. గతేడాది పవిత్ర రంజాన్ మాసంలో చేసిన వాగ్దానాన్ని ఏడాది తిరగకముందే నెరవేర్చి, వారికి కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే… గతేడాది రంజాన్ మాసం సందర్భంగా మంత్రి లోకేశ్‌ మంగళగిరి బస్టాండ్ సమీపంలో నివసించే షేక్ షహెన్షా నివాసానికి ఆకస్మికంగా వెళ్లారు. అక్కడ షహెన్షా కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారి శిథిలావస్థలో ఉన్న రేకుల ఇంటిని మంత్రి పరిశీలించారు. తమ పూర్వీకులు నిర్మించిన ఆ ఇంటి స్థానంలో కొత్త ఇల్లు కట్టించి ఆదుకోవాలని షహెన్షా కుటుంబ సభ్యులు మంత్రిని కోరారు.