కేంద్రీయ విద్యాలయం, మదనపల్లిలో అడ్మిషన్లు ప్రారంభం.

0
2

మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. ఆయన ఇటీవల జిల్లా కలెక్టర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తరగతులు తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు) ఆవరణలో నిర్వహించబడతాయి. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 9441473837 నంబర్‌ను సంప్రదించవచ్చు.