మదనపల్లెకు చెందిన బీటెక్ విద్యార్థి సతీష్ మృతదేహం గోదావరి నదిలో లభ్యమైంది. భద్రాచలం పరిధిలోని కొల్లిగూడెం వద్ద స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు కొట్టుకుపోగా, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సతీష్ మృతదేహాన్ని గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు వెలికితీశారు. మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.










