విశాఖ పట్టణానికి చెందిన అను ఓవ్యక్తి గోసేవ చేస్తున్నాడు వివరాలు కు వెళ్లితే భీమిలి నియోజక వర్గం లో గల ఆనంద పురం మండలం లో శొంటి యం పంచాయతీ నీళ్ల కుండీలు ప్రాంతము లో విశాలమైన ప్రదేశం లో తన సొంత ఎస్టేట్ లో గో సేవా వసతి శాల లో సుమారు వంద పశువు లను పోషిస్తున్నాడు. పశువులకు కావలిసిన మేత గడ్డి తన పొలంలోనే పెంచుతూ వాటి అరోగ్య పరిస్థితి లను చూచు టకు పశు వుల డాక్టర్ నియమించాడు . వాటి సంరక్షణ కు ఫీడ్ వగైరా లను సమకూర్చుటకు 20 మంది పని వాళ్ళ ను. ఇద్దరు సూపర్వైజర్ లను నియమించాడు. పశువులు కొను గోలు చేసుకొని వచ్చిన తర్వాత ఆ పశువుల జీవితాంతం పెంచుతారు. ఒక వేళ ఇవ్వాలంటే రైతు లకు దానం గా ప్రదానం చేస్తారు లేకపోతే వయసు ఐపోయి మరణిస్తే అక్కడే దహన సంస్కారాలు నిర్వహిస్తారు. గోసేవ లో పని చేస్తున్న సిబ్బందికి వసతి . భోజనం కల్పించారు . భారత్ ఆ వాజ్ గోసేవ ఎస్టేట్ సంధర్శించగా వెలుగు లోనికి వచ్చింది. నిర్వాహకుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని సేవ లు కన్నా నోరు లేని మూగ జీవులకు సేవ చేయడం పుణ్యం. ధన్యత. కలుగుతుందని అందుకే ఈ సేవకు పూ నుకొన్నా నీ చెప్పారు. ఏదీ ఏమైనా ఇలాంటి ధర్మాత్మా వ్యక్తులు వుండడం వల్ల ధర్మం న్యాయం విలువలు ప్రపంచంలో తెలుస్తూ న్నాయని. విశాఖ చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అనుకుంటున్నారు







