చీరాల: చీరాలలో రంజాన్ పండగ ముగిసిన మరుసటి రోజు ముస్లింలు 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం విశ్రాంతి, ఆనందాన్ని ఆస్వాదించేందుకు కుటుంబ సమేతంగా సముద్ర తీర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. చిన్నలు, పెద్దలు కలిసి సముద్ర స్నానాలు చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా గడుపుతున్నారు.ఇది ఆచార పరమైన కార్యక్రమం కాకపోయినా, రంజాన్ సందర్భంగా దూర ప్రాంతాల్లో నివసించే బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఒకేచోట చేరుతారు. పండగ అనంతరం కూడా కలిసి గడపాలనే ఉద్దేశంతో సముద్రతీరాలకు వెళ్లి ఆనందాన్ని పంచుకుంటున్నారు.ప్రత్యేకంగా చీరాల ప్రాంతంలోని సముద్ర తీరాలు అయిన రామాపురం,ప్రాంతాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని సహజ సౌందర్యం, చల్లని గాలి సందర్శకులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, పర్చూరు తదితర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు చీరాల సముద్రతీరానికి తరలివచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపి వెళ్తారు.
#Narendra









