బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు

0
0

చీరాల: చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు రూరల్ సీఐ శేషగిరిరావు గారు వేటపాలెం ఎస్సై జనార్ధన్ గారుశక్తి టీం ఎస్సై హరిబాబు మరియు కానిస్టేబుల్ కే. సుబ్బారావు, వేటపాలెం మండలం లోని వివేరా బీచ్ ఏరియా నందు శక్తి యాప్ వినియోగంపై, మాదకద్రవ్యాల ప్రమాదాలపై, డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారం, అలాగే పోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సుబ్బారావు మాట్లాడుతూ అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో, వేధింపుల్లో, అత్యవసర పరిస్థితుల్లో, వెంటనే సహాయం కోసం శక్తి యాప్ ఎంత ఉపయుక్తమో విద్యార్థులకు వివరించారు. అలాగే పోలీసు అధికారులు  ” డ్రగ్స్ వద్దు బ్రో ” పేరిట మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను చైతన్య పరిచారు. నేటి యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు నాశనం చేస్తుందని చెప్పారు. వేటపాలెం లో డ్రగ్స్ పై నిఘ మరింత బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.  మరియు చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఇన్చార్జి ఎస్సై హరిబాబు, సుబ్బారావు ( కానిస్టేబులు) పాల్గొన్నారు.

#Narendra