ఉగాది సందర్భంగా విడుదలైన 2026 జాబ్ క్యాలెండర్‌లో పాఠశాల విద్యలో వ్యాయామ విద్య (physical Education) విభాగంలో పీఈటీ పోస్టులు చూపించకపోవడం శోచనీయమని అన్నమయ్య జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షులు నరేష్ బాబు అన్నారు. ప్రభుత్వాలు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడం తప్ప ఆచరణలో శూన్యమని, విద్యార్థులలో క్రమశిక్షణ లోపిస్తోందని, ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి పీఈటీ పోస్టులను, ఉన్నత పాఠశాలలకు ఎస్ఏ (పీఈ) పోస్టులను మంజూరు చేసి, రాబోయే డీఎస్సీ 2026 ద్వారా భర్తీ చేయాలని ఆయన కోరారు. ఇంటర్మీడియట్ కళాశాలల్లో 64 పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పదోన్నతులు కల్పించి జూనియర్ కళాశాలల్లో పోస్టులు భర్తీ చేస్తే సుమారు 700 జూనియర్ లెక్చరర్ (పీడీ) పోస్టులు భర్తీ చేయవచ్చని, యువజన సేవా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో జోక్యం చేసుకుని అన్ని ఇంటర్మీడియట్ కళాశాలల్లో పీడీ పోస్టులు మంజూరు చేయాలని అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తోంది.
Home South Zone Andhra Pradesh వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచనలు









