రాజంపేట నియోజకవర్గం పరిధిలోని రాజంపేట మండలంలో ఈనెల 18వ తేదీన పురుషుణాకాల వర్షాలకు భారీగా అరటిపంట నష్టం వాటిల్లింది ముఖ్యంగా ఆస్తవరం చెర్లోపల్లి పెద్దకారంపల్లి గ్రామాలలో నెలకొరిగిన అరటి తోటలను నియోజకవర్గ ఇన్చార్జ్ జగన్మోహన్ రాజు ఆదివారం సాయంత్రం పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారితో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫోన్ ద్వారా మాట్లాడారు క్షేత్రస్థాయిలో నష్టాన్ని త్వరగా అంచనా వేసి బాధిత రైతులకు ప్రభుత్వం నుండి తగిన నష్టపరిహారం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కష్టాల్లో ఉన్న రైతులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు










