ఏపీ అప్పుల ఊబిలో ఉంది: కూటమి ప్రభుత్వంపై చిన్న శ్రీను ఫైర్!

0
2

సాలూరులో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొరతో కలిసి జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. గిరిజన యూనివర్సిటీని మంత్రి సందర్శించకపోవడం గిరిజనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

రాష్ట్రం రూ. 3.30 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, కాగ్ నివేదికే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పెన్షన్ల మంజూరులో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తే, భవిష్యత్తులో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక విచారణ తప్పదని హెచ్చరించారు.