దొమ్మేటి వెంకటరెడ్డి ఆదర్శప్రాయులు: అదనపు ఎస్పీ.

0
2

సమాజ సంస్కర్త, విద్యాదాత దొమ్మేటి వెంకటరెడ్డి సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకటాద్రి పేర్కొన్నారు. సోమవారం మదనపల్లెలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ, సామాజిక సమానత్వం, వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం వెంకటరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. బర్మాలో వ్యాపారవేత్తగా ఎదిగి మేయర్‌గా సేవలందించి ‘బర్మా కేసరి’గా ఖ్యాతి గడించడం గర్వకారణమన్నారు.