పుంగనూరు: అసాంఘిక శక్తులకు పోలీసుల సీరియస్ వార్నింగ్!

0
0

అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో సోమవారం మధ్యాహ్నం నక్కబండ, జగనన్న కాలనీ ప్రజలకు మాదకద్రవ్యాలు, అసాంఘీక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. అనుమానస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం తెలపాలని, ఇళ్లు అద్దెకు ఇచ్చేవారు ఆధార్ కార్డు తదితర వివరాలు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.