బొబ్బిలి పరిశీలకులు Vs జిల్లా అధ్యక్షుడు: మర్యాదపూర్వక కలయక!

0
2

విజయనగరం 24 మార్చి 2026:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన సీనియర్ నాయకులు రోంగళి జగన్నాథరావు, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు జగన్నాథరావు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ భేటీలో బొబ్బిలి నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతంపై వారు చర్చించారు.

జగన్నాథరావుకు శుభాకాంక్షలు తెలిపిన చిన్న శ్రీను, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలో పార్టీని విజయపథంలో నడిపించాలని సూచించారు. ఈ కలయికతో బొబ్బిలి వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.