మచిలీపట్నం: రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ తప్పదు – ఐజీ అశోక్ కుమార్
కృష్ణా జిల్లా మచిలీపట్నం, పెడనలోని పలు పోలీస్ స్టేషన్లను ఐజీపీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. కేసుల పురోగతిని సమీక్షించిన ఆయన, జిల్లాలో గంజాయి సాగు, క్రైమ్ రేటును తగ్గించడంలో ఎస్పీ విద్యాసాగర్ కృషిని అభినందించారు. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాల నివారణలో మెరుగైన ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉందని, ఎవరైనా తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ హెచ్చరించారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు యంత్రాంగం నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు.










