మాతా బంగారమ్మ దేవాలయ కలశ ప్రతిష్ట.. ఆహ్వానం!

0
3

నందవరం గ్రామంలో శ్రీ మాతా బంగారమ్మ దేవి ఆలయ నూతన గోపుర కలశం, ముఖద్వార ప్రతిష్టాపన మరియు వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించి గ్రామ పెద్దలు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్ రెడ్డిలకు ఆహ్వాన పత్రికలను అందజేసి, శాలువాలతో సత్కరించారు.

ఆలయాలు సమాజంలో ఐక్యతకు, సంస్కృతీ పరిరక్షణకు కేంద్రబిందువులని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నిఖిల్ చక్రవర్తి, చుక్కా మల్లేష్, లింగమూర్తి తదితర వైఎస్సార్‌సీపీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ మహోత్సవం గ్రామానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.