ఉమ్మడి అనంతపురం జిల్లా సామాజికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT)కి ఎఫ్‌సీఆర్ఏ (FCRA) అనుమతులు పునరుద్ధరించబడటం జిల్లా ప్రజలకు ఎంతో సంతోషకరమైన విషయం.
ఈ కీలక నిర్ణయం జిల్లాలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, గ్రామీణ సేవలకు కొత్త ఊపిరి పోసింది.
ఈ పునరుద్ధరణ ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ప్రత్యేక చొరవ చూపిన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి జిల్లా ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది జిల్లా అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.










