కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల జీవన్ రెడ్డి…

0
4

కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల పాటు నిబద్ధతతో పనిచేసిన సీనియర్ నేత టీ. జీవన్ రెడ్డి గారు తీవ్ర ఆవేదనతో పార్టీకి దూరం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంక్షోభ సమయాల్లో పార్టీకి అండగా నిలిచి, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించిన ఆయనకు.. సొంత ప్రభుత్వంలోనే సరైన గుర్తింపు లభించలేదన్నది వాస్తవం.

ముఖ్యంగా జగిత్యాలలో ఫిరాయింపు రాజకీయాలు, స్థానిక ఎమ్మెల్యే జోక్యం ఆయనను తీవ్రంగా కలచివేసాయి.

పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఒక నికార్సైన నాయకుడికి దక్కాల్సిన గౌరవం దక్కకపోవడం, రాజకీయ కుట్రలకు ఆయన బలికావడం అత్యంత విచారకరం. ఇది కేవలం ఆయనకు మాత్రమే కాదు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు కూడా పెద్ద నష్టం.