కూటమి ప్రభుత్వం రైతన్నల కల

0
2

– _*గోనెగండ్ల మండల పరిధిలోని ఎన్నికండ్ల గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీకోసం వారోత్సవాలు – డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అన్నదాత సుఖీభవ పథకంపై అవగాహన కల్పించారు.*_

 

– _*అనంతరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, కొత్త రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం మరియు ప్రజల సమస్యలపై సంబంధిత శాఖ అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు గ్రామంలో మినీ గోకులం షెడ్‌ను ప్రారంభించారు.*_

 

_*ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.*_