టిడిపి కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ ప్రజా దర్బార్

0
0

మంగళగిరి: మంత్రి నారా లోకేష్ 85వ రోజు ‘ప్రజాదర్బార్’

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రజలు, కార్యకర్తల నుండి ఆయన వినతులు స్వీకరించారు. ముఖ్యంగా ఏపీ కేబుల్ ఆపరేటర్ల సమస్యలు, న్యాయవాదుల రక్షణ చట్టం అమలు, మరియు భూ వివాదాలపై బాధితులు మంత్రికి అర్జీలు సమర్పించారు.

ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్, సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.