పుంగనూరు: తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నాయకులు

0
2

పుంగనూరు పట్టణంలో మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. అర్హులైన పేదలకు వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, నిర్మాణ ఖర్చుల కోసం ఐదు లక్షలు పెంచాలని, టిడ్కో ఇళ్లను ప్రజలకు పంపిణీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, సహాయ కార్యదర్శి మున్న, ఏఐటియుసి పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు# కొత్తూరు మురళి.