పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదం మంగళవారం వెలుగులోకి వచ్చింది. కందూరుకు చెందిన అల్తాఫ్, సురేంద్ర పెట్రోల్ క్యాన్ తో బైక్ పై వెళ్తుండగా బావాజీ మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంలో ఎదురుగా వచ్చారు. ఈ క్రమంలో రెండు వాహనాలు ఢీకొనడంతో పెట్రోల్ క్యాన్ పేలి అల్తాఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. బావాజీతో పాటు మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు# కొత్తూరు మురళి.










