ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. మార్చి 24న జరుపుకునే ఈ దినోత్సవం లక్ష్యం టిబి (క్షయ) వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం, నిర్మూలనకు కృషి చేయడం, సరైన చికిత్సపై చైతన్యం కల్పించడం ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ టిబిని సరైన సమయంలో గుర్తిస్తే ఉచితంగా పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో ఉంటుందని, లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ అంటువ్యాధి గాలి ద్వారా వ్యాపిస్తుందని, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా నివారించవచ్చని తెలిపారు# కొత్తూరు మురళి.
Home South Zone Andhra Pradesh పుంగునూరు నియోజకవర్గం:సోమల ఆరోగ్య కేంద్రంలో క్షయ నివారణపై అవగాహన సదస్సు










