మదనపల్లెలో అనుమానాస్పద మృతి.. దర్యాప్తు ప్రారంభం.

0
0

మదనపల్లె పట్టణంలో సోమవారం అన్సర్ (65) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బొంబూవీధికి చెందిన అన్సర్, స్థానిక ఖాజా కూరగాయల మార్కెట్‌లో రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఇంట్లో తలకు గాయాలతో కనిపించిన అతడిని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.