మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ గద్దె అనురాధ

0
2

ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విజయవాడలోని గాంధీజీ మున్సిపల్ స్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆమె, ఆహార నాణ్యత మరియు మెనూపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యంతో పౌష్టికాహారం అందుతోందని తెలిపారు. గత ప్రభుత్వంలో నాసిరకం భోజనం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పరిస్థితి మెరుగుపడిందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా వికాసం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.