ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని రాయపూడి వద్ద సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన నిల్వ ఉంచిన పైపులకు నిప్పంటుకోవడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. కొద్దిరోజుల క్రితమే ఎల్ అండ్ టీ సంస్థ పైపులు కూడా ఇలాగే తగలబడటంతో ఈ వరుస ఘటనలు కుట్ర కోణంలో జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరగలేదని ప్రాథమికంగా తేలడంతో, పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు. రాజధాని పనులకు ఆటంకం కలిగించే చర్యగా దీనిని భావిస్తున్నారు.










