హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ !

0
2

తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు జీవో నెం. 16 ద్వారా టీడీఆర్ (TDR) నిబంధనలలో కీలక మార్పులు చేపట్టింది. ఇకపై హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 10 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మించే హై-రైజ్ భవనాలకు 10% టీడీఆర్ వినియోగం తప్పనిసరి.

భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం 200% నుండి 400% వరకు భారీ పరిహారాన్ని టీడీఆర్ రూపంలో ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు రూ. 2,000 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లకు డిమాండ్ పెరగనుంది. అయితే, నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ. 200-400 వరకు పెరగడంతో భవిష్యత్తులో అపార్ట్‌మెంట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.