దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు.
‘బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది’ అని భయపెట్టడం, ఫేక్ జాబ్ ఆఫర్లు, లోన్ యాప్స్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ స్కీముల పేరుతో లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలు జరుగుతున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, PIN వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ చెప్పకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. అప్రమత్తతే సైబర్ నేరాల నుండి రక్షణని అధికారులు సూచిస్తున్నారు.
@Reporter SIVAJI










