జాతీయ విలువిద్య పోటీలు: మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఘన ఆహ్వానం

0
2

రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలో చెరుకూరి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 26 నుండి ఏప్రిల్ 6 వరకు గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న జాతీయ విలువిద్య ఛాంపియన్‌షిప్ పోటీల గురించి మంత్రికి వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) మద్దతు అందిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక క్రీడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ నిర్వాహకులు మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు.