జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కింద వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన, ప్రభుత్వం పీజీఆర్ఎస్ అర్జీలపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నందున అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని సూచించారు. పెండింగ్ కేసులను తగ్గించి, గ్రీవెన్స్ ఆడిట్ నిర్వహించాలని, అలాగే గ్రామాల స్థాయికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని తెలిపారు.










